విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్

– వేములవాడ లో ఎస్ఎఫ్ఐ టాలెంట్ టెస్ట్ విజయవంతం
– టాలెంట్ టెస్ట్ ప్రశ్న పత్రాన్ని ఆవిష్కరించిన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, ఉపాధ్యాయులు
నవతెలంగాణ – వేములవాడ
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), రాజన్న సిరిసిల్ల  జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19,20 తేదీల్లో నిర్వహిస్తున్న  టాలెంట్ టెస్ట్ మొదటి రోజు సిరిసిల్ల నియోజక వర్గంలో  రెండవ రోజు మంగళవారం వేములవాడ నియోజకవర్గ పరిధిలో నిర్వహించగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పరిక్ష వ్రాసి విజయవంతం చేశారు. ఈ పరీక్ష గత 10 సంవత్సరాలుగా జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ టాలెంట్ టెస్ట్ పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులతో  మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ ఎస్ఎఫ్ఐ నిర్వహించే టాలెంట్ టెస్ట్ విద్యార్థుల మెదళ్ళ మానసిక అభివృద్ధికి ఉత్ప్రేరకంగా ఉంటుందన్నారు. విద్యారంగంలో నిష్ణాతులైన వారిచే ప్రశ్నాపత్రం రూపొందించినట్లు పేర్కొన్నారు.పదవ తరగతి విద్యార్థులు చదువుల్లో రాణించాలని, 10వ తరగతి ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు అన్నారు. మండల స్థాయిలో జిల్లా స్థాయి లో రాణించిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంస పత్రాలు  అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేణు, మోహన్, ప్రవీణ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love