Saturday, August 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసీఎంతో తమిళనాడు మంత్రి భేటీ

సీఎంతో తమిళనాడు మంత్రి భేటీ

- Advertisement -

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డితో తమిళనాడు మంత్రి పి విశ్వనాథన్‌ ‌భేటీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌‌లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సీఎం అభినందించారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాల గురించి సీఎంను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ ‌తరుపున విజయం సాధించి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన తెలంగాణ కాంగ్రెస్‌‌ పార్టీకి ఇన్‌‌చార్జీ బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర నాయకులతో ఆయనకు సత్ససంబంధాలున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -