తండ్రి కలను నెరవేర్చిన తనయ

The son who fulfilled his father's dream– డాక్టర్ పట్టా అందుకున్న శ్వేత
– పేద పిల్లలకు చదువే ఆయుధం కావాలి
నవతెలంగాణ – తొగుట
తండ్రి తమ పిల్లల గురుంచి ఎన్నో కలలు కంటా రు. వాటి సాకారం కోసం సర్వస్వం దారపోస్తుం టారు. తన బిడ్డ డాక్టర్ కావాలని ఓ తండ్రి ఎన్నో కలలు కన్నాడు. బిడ్డ కోసం ఎంతో శ్రమించాడు. తండ్రి శ్రమకు తగ్గట్టుగా కుమార్తె కూడా అహర్ని శలు శ్రమించింది. తండ్రి ఆకస్మాత్తుగా దూరమైనా తండ్రి కన్న కలల సాకారం కోసం కృషి చేసింది. తండ్రి పోతరాజు యాదగిరి లేని లోటును తల్లి భాగ్య అన్ని తానై నెరవేర్చింది. శనివారం ఆ కుమా ర్తె డాక్టర్ పూర్తి చేసి పట్టా అందుకుంది. తండ్రికి అంకితమిచ్చింది. మండలంలోని వెంకట్రావ్ పేట గ్రామానికి చెందిన పోతరాజు యాదగిరి దంపతు లది పేద కుటుంభం. తనకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తూ కూలీ పనులతో కుటుంబాన్ని పోషించేవారు. తన కూతురు డాక్టర్ కావాలన్న లక్ష్యంతో ఉన్నత చదువులు చదివించాడు.‌ గత మూడు, నాలుగు సంవత్సరాల క్రితం తండ్రి యాద గిరి ఆకాల మరణం చెందారు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయిన చదువు మాత్రం మానలేదు. కూతురు చదువు తల్లిపై పడగా తల్లి భాగ్య ధైర్యంతో ఎంబిబిఎస్ చదివించింది. యాదగిరి మృతి చెంది నప్పుటి నుండి హైదరాబాదులో నివాసం ఉంటు కూలీ పనులు చేస్తూ కూతురును బాగా చదివిం చింది. నాలుగేళ్ల ఎంబిబిఎస్ పూర్తి కావడంతో శనివారం మమత అకాడమి ఆఫ్ మెడికల్ సైన్స్ వారు శ్వేతకు డాక్టర్ పట్టాను అందించారు. డాక్టర్ పట్టా అందుకోవడం వల్ల ఆ కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. ఇలాంటి స్ఫూర్తి అందరూ తీసుకోవాలి.
పేదరికం అడ్డుపెట్టుకొని చదువులో వెనక్కి తగ్గడం అంటే అది మన బలహీనతే తెలిపారు. ఆర్ధిక సమా నత్వం రావాలి అంటే.. కష్టపడి ముందుకు సాగాల్సిందే అని సూచించారు. బావి తరాలకు చదువును మించిన భవిష్యత్ లేనే లేదని హితవు పలికారు. పేదలకు తనవంతు వైద్య సేవలు అందిస్తానని అన్నారు – – డాక్టర్ శ్వేత.

Spread the love