ఆదాయం పెంచే మార్గాలపై లక్ష్యం పెట్టలి.! 

– సిద్దిపేట డి ఆర్ డి ఓ జయదేవ్ ఆర్య
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
గ్రామీణ ప్రాంతంలోని మహిళలు ఆదాయం పెంచుకునే మార్గాలను ఎంచుకొని లక్ష్యంతో పనిచేస్తే ఆర్థికంగా ఎదుగుతారని సిద్దిపేట డి ఆర్ డి ఓ జయదేవ్ ఆర్య అన్నారు. మంగళవారం హుస్నాబాద్ లో టిటిసి భవన్ లో  మగ్గం వర్కర్స్ శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా డి ఆర్ డి ఓ జయదేవ్ ఆర్య మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండి సమాజాభివృద్ధికి లో ముఖ్య భూమికను పోషిస్తున్నారని అన్నారు.  జిల్లాల్లో డిమాండ్ ఉన్న కోర్సు లను ఎంపిక చేసి  గ్రామీణ ప్రాంతాల యువతకు నైపుణ్య శిక్షణలు ఇస్తున్నామని చెప్పారు. నైపుణ్య కేంద్రాలే కాకుండా మానవ సంబంధాలు, వ్యాపార నిర్వహణ మెలకువలు  కూడా నేర్పియడం జరుగుతుందని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో అర్హులైన వారికి వివిధ పథకాల ద్వారా ఋణాలు ఇప్పించే బాధ్యత లీడ్ బ్యాంక్ ద్వారా చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డి ఆర్ డి ఓ బాలకిషన్, సతీష్, ఎంపీడీవో వేణు గోపాల్ రెడ్డి, డిస్టిక్ ప్రాజెక్టు మేనేజర్ కర్ణాకర్, ఎపియం శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
టైలరింగ్ యూనిట్ సెంటర్ ను సందర్శించిన డి ఆర్ డి ఓ జయదేవ్ ఆర్య
హుస్నాబాద్ మండలంలోని పోతారం ఎస్ గ్రామంలోని శ్రీ శక్తి స్వశక్తి టైలరింగ్ యూనిట్ ను సిద్దిపేట డిఆర్డిఓ జయదేవ్ ఆర్య సందర్శించారు. స్కూల్ పిల్లలకు యునీఫామ్స్ తొందరగా అందించాలని తెలిపారు.
Spread the love