
మండలంలోని మామిడిపల్లి గ్రామ శివారులో ఆదివారం అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా మొరం తరలిస్తున్న జేసీబీ రెండు టిప్పర్లు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని మాక్లూర్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. తనిఖీల్లో టాస్క్ ఫోర్స్ ఏసీపీ రాజశేఖర్ రాజు, సీఐ అంజయ్య, అజయ్ బాబు, సిబ్బంది సుధాకర్, లక్ష్మణ్, నరసయ్య పాల్గొన్నారు.