టాటా మోటార్స్‌ ‘కస్టమర్‌ కేర్‌ మహోత్సవ్‌’

ముంబయి : దిగ్గజ ఆటోమొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌ తన వాణిజ్య వాహన వినియోగదారులకు సమగ్ర సేవలందించడానికి ‘కస్టమర్‌ కేర్‌ మహోత్సవ్‌ 2024’ను ప్రారంభించినట్టు తెలిపింది. వాహనాల శ్రేణీకి సంబంధించి తనిఖీలు, విలువ ఆధారిత సేవలు, డ్రైవర్‌ శిక్షణతో సహా మెరుగైన విక్రయానంతర అనుభవాన్ని అందించడం లక్ష్యంగా ఈ ప్రోగ్రామ్‌ ఉంటుందని పేర్కొంది. దీన్ని 2500 పైగా డీలర్‌షిప్‌ల్లో 2024 డిసెంబర్‌ 24 వరకు నిర్వహించనున్నట్టు పేర్కొంది.

Spread the love