రేపు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు.. పోలింగ్ కి ఏర్పాట్లు పూర్తి 

Upadhyaya MLC election tomorrow... Arrangements for polling are complete– ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు మొత్తం 65 
నవతెలంగాణ – తాడ్వాయి 
నల్గొండ- ఖమ్మం- వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మండల కేంద్రంలో, ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, అన్ని వసతులు కల్పించి, పూర్తి ఏర్పాట్లు చేసినట్లు స్థానిక మండల ఎన్నికల అధికారి, ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్లు తెలిపారు.  మండలంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల సంఖ్య 65 కాగా, ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించినట్లు తెలిపారు. మండలంలోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ మనోజ్ కుమార్, ఏ పీ ఓ దాదా సింగ్, స్థానిక మండల రెవెన్యూ ఆఫీసర్ (ఎం ఆర్ ఐ) డేగల సాంబయ్య, స్థానిక పోలీస్ కానిస్టేబుల్ పూజారి రమేష్, రెవిన్యూ, పంచాయతీరాజ్, పోలీసులు అధికారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు..
మండలంలో నిర్వహించే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా ఎస్పీ శబరిస్ ఆదేశాల మేరకు, పోలీస్ అధికారుల పస్రా సిఐ గద్ద రవీందర్, స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి లు ఎన్నికల కేంద్రం వద్ద, మండలంలో జాతీయ రహదారిపై భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాడ్వాయి మండలం దట్టమైన అడవి ప్రాంతంలో ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే పటిష్టమైన చర్యలు చేపట్టారు. పస్రా టూ  తాడ్వాయి, తాడ్వాయి టూ ఏటూరు నాగారం 163 జాతీయ రహదారిపై అన్ని మోరీలను చిన్నచిన్న బ్రిడ్జిలను పోలీసులు ముందస్తుగా తనిఖీలు నిర్వహించారు. ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Spread the love