ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం 

Everything is ready for Upadhyaya MLC electionనవతెలంగాణ – పెద్దవంగర
వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. మండలం నుండి 34 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును బ్యాలెట్ ద్వారా వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 17 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నేడు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని, 4 గంటల సమయానికి ఓటు వేసేందుకు లైన్‌ లో ఉన్నవారందరికీ ఓటు వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాగే ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్సై క్రాంతి కిరణ్ తెలిపారు.
Spread the love