
ఉత్తమమైన సమాజాన్ని నిర్మించడంలో ఉపాధ్యాయులే కీలక పాత్ర పోషిస్తారు. విద్యార్థులు రేపటి తరపు అధినేతలు. అనుముల మండలం ఇబ్రహీం పేట ప్రాథమికోన్నత పాఠశాలలో స్వపరిపాలనా దినోత్సవం వేడుక ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వపరిపాలన దినోత్సవం విద్యార్థులలో బాధ్యతను ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని, తమ పిల్లలు ఇలా పాల్గొనడం ఎంతో ఆనందదాయకమని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులను ఉత్తమంగా తయారు చేస్తున్న పాఠశాల ఉపాధ్యాయ బృందం పై ప్రశంసలు కురిపిస్తూ ,భవిష్యత్తులో కూడా తమ పిల్లలు ఇలా తయారు కావడానికి పాఠశాల చదువు పునాది అని విద్యార్థుల తల్లి దండ్రులు హర్షం వ్యక్తం చేసారు . విద్యార్థులు స్వీయ క్రమశిక్షణ అలవర్చుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని విద్యార్థులు అధికారులుగా ఉపాధ్యాయులుగా ప్రజా ప్రతినిధులుగా తమ పాత్రలను చక్కగా పోషించి అలరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులుగా, అధికారులుగా మోక్షిత్ వర్ష, పావని, లాస్య, ఝాన్సీ,కావ్య, జస్వంత్, శివశరత్ తదితరులు వ్యవహరించారు. పాఠశాలను చక్కగా నిర్వహించిన విద్యార్థులను ఉపాధ్యాయులు కె. దయాకర్ రెడ్డి, ఎం. శంకరాచారి, ఓ. సరిత, డి. మహేశ్వరి, ఎస్ కె జమీలా బేగం తదితరులు అభినందించారు.