
అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని టీజీవిపి జిల్లా అధ్యక్షులు సంజయ్ తెలిపారు. హెచ్.సి.యూ యూనివర్సిటీ భూముల జోలికి ప్రభుత్వం రావద్దని డిమాండ్ చేశారు. 400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూమిని అమ్మకానికి పెట్టే ప్రయత్నాలను ప్రభుత్వము ఇప్పటికైనా విరమించుకోవాలని, విశ్వవిద్యాలయాలను విద్య వ్యవస్థను బలోపేతం చేయవలసిన అవసరం ప్రభుత్వానికి ఉంది కానీ విశ్వవిద్యాలయాల భూములను అన్యాయంగా అమ్ముకోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా నియోజవర్గ ఇన్చార్జ్ ఎండి సమీర్ ఉన్నారు.