నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని హస కొత్తూర్ గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ దంపతులను స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సన్మానించారు. ఈ మేరకు శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ కుమార్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సర్పంచ్ ఏనుగు పద్మ రాజేశ్వర్ దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ కుమార్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి సర్పంచ్ ఏనుగు పద్మ రాజేశ్వర్ ఎంతగానో సహాయ సహకారాలు అందించారని తెలిపారు.పాఠశాలలో ఏదైనా సమస్య ఉంటే వారి దృష్టికి తీసుకు వెళ్లిన వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేశారన్నారు.పాఠశాల అభివృద్ధికి సర్పంచ్ దంపతులు చేసిన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ ప్రత్యేక అధికారి, మండల విద్యాధికారి ఎన్. ఆంద్రయ్య, పంచాయతీ కార్యదర్శి నల్లగంటి నర్సయ్య, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.