రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపికైన ఉపాధ్యాయులు

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల కేంద్రం  ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న గాజుల వెంకటేష్ తయారు చేసిన జియోబోర్డ్ టి.ఎల్.ఏం కు, పద్మావతి తయారు చేసిన మానవ శరీరం నిర్మాణం టి.ఎల్.ఎం కు వారిని బెస్ట్ టి.ఎల్.ఏం మేకర్ లు గా టి.యస్.టి.ఎల్.ఎం గ్రూపు వారు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత బోయడ నర్సయ్య ఆధ్వర్యంలో ఎంపిక చేసి అభినందిస్తూ ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేష్, పద్మావతి లకు మండల విద్యాశాఖ అధికారి రామారావు, ఎఫ్.ఎల్.ఎన్ నోడల్ అధికారి చంద్రశేఖర్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ, బాలమణి, శ్రీనివాస్ లు అభినందనలు తెలియజేశారు.  బోధనోపకరణాలు(టి.ఎల్.ఏం) ను స్థానిక పరిసరాల్లో లభించే కాస్ట్/నో కాస్ట్ మెటీరియల్ తో తయారు చేసి వాటి ద్వారా విద్యార్థులకు సులభంగా అర్ధం అయ్యేలా కృత్యాధార బోధన చేస్తూ నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తున్నామని వెంకటేష్, పద్మావతి తెలిపారు. విద్యార్థులు వినడం, చూడటం కంటే స్వయంగా చేయడం ద్వారా, కృత్యాల్లో పాల్గొనడం ద్వారా అనుభవాలతో అభ్యసనంతో ఎక్కువగా నేర్చుకొంటారని దాని కోసం టి.ఎల్.ఎం లు ఉపయోగపడతాయని తెలియజేశారు. ఈ జియోబోర్డ్ తో ఆకారాలు, సంఖ్యలు, సంఖ్యలను పోల్చడం, స్థాన విలువలు, చతుర్విధ ప్రక్రియలు కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం, భిన్నాలు, చుట్టుకొలత, వైశాల్యం, బార్ గ్రాఫ్ ద్వారా దృశ్యీకరణ గణిత భావనలను సులభంగా అర్థం చేయించి గణితం అంటే భయం లేకుండా ఆసక్తితో నేర్చుకొనేల అవగాహన కల్పించవచ్చని ఇలా నేర్చుకున్న విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయని ఉపాధ్యాయుడు వెంకటేష్ తెలిపారు. అదేవిధంగా ఈ మానవ శరీరం టి.ఎల్.ఎం ద్వారా రక్త ప్రసరణ వ్యవస్థ, కండర వ్యవస్థ, అస్తిపంజర వ్యవస్థ, శరీరంలోని అంతర్భాగాల గురించి సులభంగా విద్యార్థులకు అవగాహన కల్పించవచ్చని పద్మావతి తెలిపారు.
Spread the love