– విద్యా వాలంటీర్లను నియమించాలి : టీఎస్‌సీపీఎస్‌ఈయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేస్తూ ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులతో పలు పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను తాత్కాలిక సర్దుబాటు చేయాలనీ, ఖాళీలను విద్యా వాలంటీర్లతో భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మ్యాన పవన్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 1,947 మంది ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా, 2162 మంది ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా, 5,870 మంది స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందారని తెలిపారు. దీంతో చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయ కొరత ఏర్పడిందనీ, 25,036 ఉపాధ్యాయుల స్థానంలో చాలా వరకు రిలీవర్లు రాలేదనీ, దీంతో అక్కడే పనిచేయాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. పదవీ విరమణ పొందుతున్న, దీర్ఘకాలిక, ప్రసూతి సెలవుల్లో ఉన్నవారి స్థానంలో తాత్కాలిక ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని కోరారు.