విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలి: తహసీల్దార్..

నవతెలంగాణ-  మిరుదొడ్డి
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు ప్రభుత్వ పాఠశాలలో కల్పించడం జరుగుతుందని తహసిల్దార్ గోవర్ధన్ అన్నారు. మిరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మండల మండల స్థాయి అధికారులు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా పాఠశాల ప్రారంభం రోజు నాడే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు ఏకరూప దుస్తులను అందించడం హర్షనీయమన్నారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రైవేటు పాఠశాల మోజులో పడి విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులకు గురి కావద్దని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధనతో పాటు పౌష్టికాహారం అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీతో పాటు ఏకరుప దుస్తులను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గణేష్ రెడ్డి ,ఎంఈఓ ప్రభుదాస్, కాంప్లెక్స్ హెచ్ఎం వెంకట్రామలింగం, ఎస్సై పరశురాములు పలువురు పాల్గొన్నారు.
Spread the love