నవతెలంగాణ – బెజ్జంకి
కరీంనగర్ జిల్లా పరిపాలనాధికారి అదేశం మేరకు మండలంలోని గ్రామాల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక ఓటర్ నమోదు ప్రక్రియ చేపట్టామని అర్హులైన వారందరు సద్వినియోగం చేసుకోవాలని తహసిల్దార్ శ్యామ్ తెలిపారు.శనివారం మండల పరిధిలోని అయా గ్రామాల్లో చేపట్టిన ప్రత్యేక ఓటర్ నమోదు ప్రక్రియను తహసిల్దార్ శ్యామ్ సందర్శించి పరిశీలించారు.ప్రత్యేక ఓటర్ నమోదు ప్రక్రియలో ఓటర్ జాబితాలో మార్పులకు నేటితో ముగియనుందని బీఎల్ఓలు అందుబాటులో ఉండాలని తహసిల్దార్ సూచించారు.