ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ – నెల్లికుదురు

మండలంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా జెండాలు ఎగురవేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ గుంటుక యాకన్న మరియు పోలీస్ కానిస్టేబుల్ సిబ్బందితో కలిసి జండా ఎగరవేశారు తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ కోడ్ చింతల రాజు తన సిబ్బందితో కలిసి జండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి ఎంపీడీవో బాలరాజు మరియు ఎంపీవో పార్థసారథి తమ సిబ్బంది తో కలిసి ఘనంగా జండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐకెపి వెలుగు కార్యాలయంలో మయూరి మండల సమైక్య అధ్యక్షురాలు పెరుమల్ల కవిత ఏపీ ఎ  వరదయ్య తల సునీత సిసి లతో కలిసి జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ దావకానలో డాక్టర్ వంశీకృష్ణ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కవిరాజు గౌటు హైస్కూల్లో జాఫర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు సాయిలు లు తెలంగాణ రాష్ట్ర విభవ దినోత్సవం సందర్భంగా జెండాలు ఆవిష్కరించి సంబరాలు నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేర్వేరుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు:
ఒకే పార్టీ వేర్వేరు చోట్ల జెండా ఆవిష్కరణ..
మళ్లీ గ్రూపు తగాదాలు బగ్గుమన్న నెల్లికుదురు కాంగ్రెస్ పార్టీ నాయకులు.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైస్ ఎంపీపీ జెల్లా వెంకటేష్ మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయని సత్యపాల్ రెడ్డి జిల్లా నాయకులు బాలాజీ నాయక్ లక్ష్మారెడ్డి రాజేష్ లతో కలిసి జండా ఎగరవేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదల యాదవ రెడ్డి మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్ల జెండాను ఎగరవేశారు మండల కేంద్రంలో పట్టణ అధ్యక్షుడు రత్నపురం యాకయ్య ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మద్ది రాజేష్ రావుల సతీష్ కాలేరు మల్లేష్ కుమ్మరి కుంట్ల మౌనేందర్ మాజీ ఎంపీటీసీ నరేష్ మల్లేష్ వెంకటేశ్వర్లు వారి పల్లి ఉప్పలయ్య వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Spread the love