– జిల్లా కో కన్వీనర్ దుబాసి పార్వతి
నవతెలంగాణ – మల్హర్ రావు:- తెలంగాణ ప్రజా ఫ్రంట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మూడవ మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా కో కన్వీనర్ దుబాసి పార్వతి,కుడమేత సరస్వతి పిలుపునిచ్చారు ఆదివారం కాటారం మండల కేంద్రంలో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించి,మాట్లాడారు ఎన్నో పోరాటాల ఫలితంగా కోటి ఆశలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ప్రజల ఆశలు అడి ఆశలైన వేళ మలిదశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరి పోసిన తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రజాస్వామిక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ సమాజం ఏడు దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేసిందని, ఇప్పటికి చేస్తూనే ఉందన్నారు. ఆవిర్భావ నుండి తెలంగాణ ప్రజా ఫ్రంట్ దోపిడి పీడన లేని ప్రజాస్వామిక తెలంగాణపై మహనీయుల ఆశయ సాధనకై ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు.ఎన్నో పోరాటాలతో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆశలు ఆకాంక్షలు లేవి నెరవేరలేదని, రాష్ట్రంలో ఎన్నో జెండాలు మారిన ఎవరు అధికారంలోకి వచ్చిన తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని బడ బూర్జవా డదారులకు తాకట్టు పెట్టి తమ గడుపుతున్నారని తెలిపారు. ప్రశ్నించే గొంతులపై కొత్త కొత్త చట్టాలు ప్రయోగిస్తూ ప్రశ్నించే గొంతులను లేకుండా చేస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో విడత ప్రజలంతా ఏకమై అన్ని రకాల దోపిడి పీడన అణిచివేత అక్రమాలు అన్యాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక తెలంగాణకై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కుల మత లింగ వివక్షల వ్యత్యాసా లు లేని సమ సమాజ స్థాపన కోసం ఉద్యమించడం ద్వారానే తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. ఈ దశలో అడుగులు వేద్దాం అందరం సమాన అవకాశాలతో జీవించే సమాజం కోసం పోరాడుదాం నూతన సమాజాన్ని నిర్మించుకుందామన్నారు.ఈ సందర్భంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మూడో మహాసభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభకు ప్రజలు ప్రజాస్వామిక వాదులు మేధావులు కార్మికులు కర్షకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్. మహిళ ప్రజా సంఘాల నాయకురాలు బూడిద లావణ్య. లెంకలపల్లి లక్ష్మి. గన్నారపు మల్లిక. బల్ల సునీత. చింతల రజిత. ఎద్దు పుష్ప. జంబూజి పద్మ.తదితరులు పాల్గొన్నారు.