- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పోలండ్‌లో మృతి చెందిన ఏపీలోని విశాఖకు చెందిన గోకేటి ప్రసాద్ బాబు మృతదేహాన్ని స్వదేశానికి రప్పించే ప్రక్రియ తుదిదశకు చేరింది. ఎంపీ శ్రీభరత్ చొరవతో, కేంద్ర హోంశాఖ అనుమతి పొంది ICWF నిధుల ద్వారా విమానంలో హైదరాబాద్ మీదుగా తరలిస్తున్నారు. ఆదివారం రాత్రికి మృతదేహం చేరుకోనుండగా, ‘ఓపస్’ ఫ్యునరల్ సర్వీసెస్ సహాయంతో అంత్యక్రియల నిమిత్తం భీమిలిలోని మహాలక్ష్మిపురానికి తరలించనున్నారు.
- Advertisement -



