తెలంగాణ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత..

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌లోని తెలంగాణ బీజేపీ కార్యాలయం వద్ద శనివారం మధ్యాహ్నం ఉద్రిక్తత చోటు చేసుకుంది. నీట్ ఎగ్జాంలో భారీ కుంభకోణం జరిగిందంటూ ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ప్రతిగా రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాసేపు ఇరువర్గాల పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలను అక్కడి నుంచి తీసుకువెళ్లారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.

Spread the love