టీజీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల..

నవతెలంగాణ-హైదరాబాద్‌: తెలంగాణలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పీజీఈసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్‌టీయూహెచ్‌లో ఉన్నత విద్యాశాఖ అధికారులు ఈ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 20,626 మంది విద్యార్థులు రాయగా.. పరీక్ష నిర్వహించిన నాలుగు రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం విశేషం.

Spread the love