మాటే మంత్రం

– వాయిస్‌ కల్చర్‌పై ‘సురభి’ వర్క్‌షాప్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పదిమందిలో మాట్లాడాలన్నా, పాట పాడాలన్నా, నచ్చిన ప్రొఫెషన్‌లో తమకంటూ ఒక మార్క్‌ని క్రియేట్‌ చేసుకోవాలన్నా కావాల్సింది మాటే. ఆ మాటను పలికించే గొంతుకి గాత్రధర్మం ఉంటుంది. అదే వాయిస్‌ కల్చర్‌. ఇప్పుడు మధురమైన స్వరం… మార్కెట్లో అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు సెలబ్రిటీ గుర్తింపునూ తెస్తుంది. ఈ రంగంలో అనేక అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సురభి కళాక్షేత్రం వ్యవస్థాపకులు, రేడియో జాకీ, వాయిస్‌ అండ్‌ యాక్టింగ్‌ ట్రైనర్‌ డాక్టర్‌ సురభి రమేష్‌ బుధవారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఎవరి వాయిస్‌ కల్చర్‌ ఎలాంటిదో తెలుసుకుంటే ఆ రంగంలో ప్రతిభను నిరూపించుకోవచ్చన్నారు. దీనికోసం సురభి కళాక్షేత్రం ఆధ్వర్యంలో వాయిస్‌ అండ్‌ స్పీచ్‌ వర్క్‌షాప్‌ సీజన్‌-10 నిర్వహిస్తున్నామని తెలిపారు. నవంబర్‌ 14 నుంచి సికింద్రాబాద్‌ సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌ రోడ్‌లోని ఆవర్‌ సాక్రిడ్‌ స్పేస్‌లో క్లాసులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు ఇతర వివరాలకు ఫోన్‌ నెంబర్లు 9490423885, 6309413885 సంప్రదించాలని కోరారు.

Spread the love