నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని శ్రవణ్ గార్డెన్ లో స్మైల్ ద స్కూల్ 15వ వార్షికోత్సవ స్మైల్ ఫీస్ట వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించినారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈటీవీ రంగుల రాట్నం సీరియల్ లో నటించిన పద్మావతి, దివ్య లు హాజరై మాట్లాడుతూ, విద్యార్థులు ఒక ప్రణాళిక ప్రకారంగా చదవాలన్నారు. తల్లిదండ్రులు విద్యార్థుల పై ఒత్తిడి తెవద్దన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి స్థాయికి రావాలన్నారు. చెడు మార్గంలో పయనించవద్దని, అన్నారు. విద్యార్ధులు చేసిన డ్యాన్స్ లు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ రఫీయొద్దీన్ గోహర్, ప్రిన్సిపాల్ షబానా గోహార్, ఉపాధ్యాయులు ప్రసన్న లక్ష్మి, సవిత, సింధూర, శ్రావణి, సిందూజ, రోజా, సరిత, స్వప్న, విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.