
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
ప్రస్తుతం దేశంలో ప్రజాతంత్ర, సోషలిస్ట్ విప్లవమే సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ లక్ష్యమని సీపీఐ ( ఎంఎల్ ) మాస్ లైన్ (ప్రజాపంథా) రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి. ప్రభాకర్ అన్నారు. బుధవారం మండలంలోని హాసకొత్తూర్ గ్రామంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పిడివాదంతో కాకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కమ్యూనిస్ట్ విప్లవ కారులు కూడా తమ పంథా, కార్యక్రమంలను మార్చుకొనవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పీసీసీ సీపీఐ (ఎంఎల్), సీపీఐ ( ఎంఎల్ ) ప్రజాపంథా, సీపీఐ (ఎంఎల్) ఇన్సియేటివ్ రివల్యూషనరి పార్టీలు విప్లవోధ్యమమే ఏకైక ఎజెండాగా ఐక్యం అవుతున్నాయన్నారు. దేశవ్యాపితంగా ఓకే అతిపెద్ద విప్లవ పార్టీగా మారానున్నాయాన్నారు. ఇందులో భాగంగానే మార్చ్ 3,4,5 తేదీల్లో ఖమ్మంలో 50వేల మందితో భారీ ర్యాలీ, బహిరంగసభను నిర్వహించడం జరుగుతుందన్నారు. దేశ ప్రధాని మోడీ నియంతృత్వంతో పాలనా సాగిస్తున్నాడని, కేవలం రాముడు పేరుతో, రాముడి జపంతో మాత్రమే పాలనా సాగిస్తూ దేశాన్ని వెనక్కి తీసుకెళ్తు ఆదాని, అంబానీలకు అప్పగిస్తున్నాడన్నారు. ప్రజలు మతోన్మాద పార్టీలకు గోరికట్టి, విప్లవ పార్టీల వైపు నిలవాన్నారు.కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు సారా సురేష్, జి.కిషన్, సత్తెక్క, కమ్మర్ పల్లి కార్యదర్శి అశోక్, నాయకులు సత్యనారాయణ, బాలకిషన్, ఉట్నూర్ అశోక్, తదితరులు పాల్గొన్నారు.