దేవాలయంపై చేసిన ఆరోపణలు అవాస్తవం

– ఉపేంద్ర శర్మను డబ్బులు అడిగినందుకే అధ్యక్షుడిపై నిందారోపణలు
– 28 సంవత్సరాలుగా ఎంతో పవిత్రంగా దేవాలయ నిర్వహణ
– విలేకరుల సమావేశంలో సాయి సేవ సమితి ట్రస్టు సభ్యులు
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
గత 28 సంవత్సరాలుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో సాయిబాబా దేవాలయాన్ని ఎంతో పవిత్రంగా అభివృద్ధి పథంలో నిర్వహిస్తున్నామని ఇటీవల దేవాలయంలో పనిచేసే గుమస్తా చేసిన నిందారోపణల్లో వాస్తవం లేదని సాయి సేవ సమితి ట్రస్ట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు దోసపాటి గోపాల్, ఉప్పల రాజేంద్రప్రసాద్ లు అన్నారు.శుక్రవారం గుడిలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు దేవాలయంలో పనిచేసే ఉపేంద్ర శర్మ దేవాలయం డబ్బులు సుమారు 3 లక్షల రూపాయలు వాడుకున్నాడని అవి అడిగినందుకు దేవాలయంపై,  అధ్యక్షుడిపై నిందారోపణలు చేస్తున్నారని అన్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గత 28 సంవత్సరాలుగా శ్రీ సాయి సేవ సమితి ట్రస్టు దేవాలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు భక్తులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ పూజా కార్యక్రమాల నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తుందన్నారు.ఉపేంద్ర శర్మ దేవాలయంపై అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ పై నిందారోపణలు చేయడం సరికాదని ఏదైనా అనుమానాలు ఉంటే కమిటీ వద్ద నివృత్తి చేసుకోవాలన్నారు.దేవాలయంలో ప్రతి గురువారం నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి వందలాది మంది భక్తులు వస్తుంటారని వారిని అడిగితే వంటకు ఉపయోగించే బియ్యం ప్రభుత్వ బియ్యమా మంచి బియ్యమా అనేది తెలుస్తుంది అన్నారు. అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ తన పూర్తి సమయాన్ని కేటాయించి ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని అన్నారు.ఉపేందర్ శర్మ డబ్బులు అడిగినందుకే ఉద్దేశపూర్వకంగా దేవాలయ అధ్యక్షుడు పై ఆరోపణలు చేస్తూ దేవాలయ ప్రతిష్టకు భంగం కలిగించడాన్ని తీవ్రంగా ఖండించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన అర్చకులు విశ్వేశ్వర శర్మ,  గంగాధర శర్మ,  శ్రీ సాయి సేవా సమితి ట్రస్టు సభ్యులు రేఖ సత్యం,  నూక వెంకటేశం,  పోలా చిన్న పురుషోత్తం,  పటేల్ నరసింహ రెడ్డి,  నీల లక్ష్మయ్య,  ఉప్పల సత్యనారాయణ,  శ్రీరామ్ కృష్ణారావు,  యాద కిరణ్, గజ్జల మురళి,  శంకర్ లాల్,  పోతుగంటి మల్లికార్జున్,  గజ్జల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love