మండలంలోని ఎడ్లపల్లి గ్రామంలో శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయ 12వ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి షిర్డీ సాయిబాబా సందర్శకులు బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కోలాహాల మధ్య బాబా పల్లకిని సాయి భక్తులు భుజాన వేసుకుని పల్లకీ సేవను ఘనంగా చేశారు. అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. షిర్డీ సాయిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలు తీరుస్తాడని ఈ ప్రాంత భక్తుల ప్రగాఢ నమ్మకం. దీంతో గురువారం ఎడ్లపల్లి షిర్డీ సాయిబాబా ఆలయ ప్రాంగణం సాయి నామస్మరణతో మార్మోగింది.