
నవతెలంగాణ-సారంగాపూర్ : కేంద్రంలో బీజేపీ పార్టీ ప్రజా వ్యతిరేక విధాలను అనుసరిస్తున్న వైఖరిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొల్లోజి నర్సయ్య,మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాధి అన్నారు బుదవారం సారంగాపూర్ మండల కేంద్రంతో పాటు అడెల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు,జై బీమ్,జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా మహాత్మ గాంధీ,అంబేద్కర్ విగ్రహాల కు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగాడుతూ బిజెపి అనుసరిస్తున్న వైఖరినీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. జై బాపు జై బీమ్, జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దశరథ రాజేశ్వర్,కిసాన్ సెల్ వర్కింగ్ ప్రసిడెంట్ పోతారెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ముత్యం రెడ్డి,నాయకులు నారాయణరెడ్డి,వెంకటరమణారెడ్డి, నవీన్ రెడ్డి,భూమారెడ్డి,రవీంద్రనాథ్ రెడ్డి మధుకర్,సత్యం,సత్యపాల్ రెడ్డి,రాము, చందు,సురేందర్,బోజన్న,సలీం, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.