సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విఫలం

– మెల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి
– ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నిరసన
నవతెలంగాణ-అల్వాల్‌
కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అధికారులు సమస్య లను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ప్రజలు ఇందిరా గాంధీ చౌరస్తా పరిసర ప్రాంతాల్లో గంటల కొద్ది ట్రాఫిక్‌ దిగ్బంధనంలో ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సమస్యలను పరిష్కరించాలని ఇందిరా గాంధీ చౌరస్తాలో నిరసన చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి, కార్పొరేటర్‌ శాంతిశ్రీనివాస్‌రెడ్డిలు మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్లుగా ట్రాఫిక్‌ ఉందని తెలిపారు. ఫుట్‌పాత్‌లను క్లియర్‌ చేసి ట్రాఫిక్‌ సమస్యలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఇందిరాగాంధీ చౌరస్తాను వెడల్పు చేసేందుకు అనుమతి ఉందని, అందుకు గతంలోనే నిధులు మంజూర య్యాయని పేర్కొన్నారు. దానిని అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారని చెప్పారు. అనంతరం ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారులతో, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి రాజేందర్‌తో కలిసి ట్రాఫిక్‌ సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డోలిరమేష్‌, ఢిల్లీ పరమేష్‌ మల్లేష్‌ గౌడ్‌, వి.ఎన్‌.రాజు, పవన్‌, కన్నా గౌడ్‌, రాజేందర్‌, యాదగిరి గౌడ్‌, సత్యనారాయణ, రాజు, గిరి, రాజేందర్‌ యాదవ్‌, సులోచన, శారద కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love