నవతెలంగాణ – మద్నూర్
2023 -24 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో 9.5 జిపిఏ ఇంటర్ మీడియట్స్ లో 950 మార్కులు సాధించిన విద్యార్థులకు కామారెడ్డి జిల్లా మున్నూరు కాపు ఆధ్వర్యంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు చేతుల మీదుగా విద్యార్థులకు మెమొంటోస్ మెరిట్ సర్టిఫికెట్లు అందజేయడం జరిగిందని మద్నూర్ మున్నూరు కాపు ముద్దుబిడ్డ బాన్సువాడ బాధ్యులు డాక్టర్ బండి వార్ విజయ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ మాట్లాడుతూ బాలరాజు మాట్లాడుతూ.. మున్నూరు కాపు విద్యార్థులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నట్లయితే వారి చదువు కొరకు ఎంత ఖర్చైనా భరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మామిండ్ల అంజయ్య ప్రధాన కార్యదర్శి పెట్టి గాడి అంజయ్య రాష్ట్ర బాధ్యులు నీలం నర్సింలు జిల్లా బాధ్యులు నీలం లింగం ఆకుల శ్రీనివాస్ సంకరి రాజలింగం సిద్ధ రాములు మామిండ్ల లింగం బాన్సువాడ బాధ్యులు బండి వార్ విజయ్ కుమార్ శ్రీనివాస్ సత్యనారాయణ కాసులు రోహిత్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.