మండలంలోని చిన్నవంగర గ్రామంలో మంగళవారం బాలవికాస సేవా సంస్థకు అనుబంధ సంస్థ అయినా జన వికాస ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మాజీ సర్పంచ్ పాకనాటి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం సంస్థ మెయిన్ కోఆర్డినేటర్ ఎం. రమ తో కలిసి ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏడాది ప్రజల దాహార్తిని తీర్చేందుకు బాలవికాస సంస్థ చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేయడానికి బొమ్మెర స్వప్న నగేష్ దంపతులు ముందుకు రావడం గొప్ప విషయం అన్నారు. మానవత దృక్పథంతో సేవా కార్యక్రమాలు చేపట్టడానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు శ్రీనాథ్ రెడ్డి, బాలవికాస కోఆర్డినేటర్ సరిత, విజయ, నాగమ్మ, నీలవేణి, బాలవికాస మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.