మతోన్మాద బీజేపీని ఓడించాలి..

 – సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
 – ప్రజా పోరాటాల వారధి సిపిఎం కు మద్దతు ఇవ్వండి
 – దోనూరి నర్సిరెడ్డిని అత్యధిక ఓట్లతో గెలిపించాలి
నవతెలంగాణ- చండూరు: మతోన్మాద బీజేపీని ఓడించాలని, ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాడుతూ ప్రజల వెన్నంటి ఉండే సీపీఐ(ఎం) అభ్యర్థి దోనూరి నర్సిరెడ్డిని అత్యధిక ఓట్లు వేసి గెలిపించవలసిందిగా సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు.సోమవారం  గట్టుపల మండల కేంద్రంలో సీపీఐ(ఎం) జనరల్ బాడీ సమావేశం కర్నాటి సుధాకర్ అధ్యక్షతన  జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కమ్యూనిస్టులకు ఓట్లు లేవు గెలవరని అన్న రాజగోపాలరెడ్డి ఎర్ర జెండా మెడలో వేసుకుని తిరగడం సిగ్గుమాలిన చర్య అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు సంగారెడ్డిలో సీపీఐ(ఎం) ఆఫీస్ కి వెళ్లి ఓట్లు వేయమని అడగడం ఏమిటని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించడం కోసం బీఆర్ఎస్ తో జతకట్టామని అన్నారు.కమ్యూనిస్టులకు అధికారం ఇస్తే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ప్రజల అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తారని అన్నారు. రైతులు కార్మికులు వ్యవసాయ కూలీల హక్కుల కొరకు పోరాడింది కమ్యూనిస్టులేననివారు అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం తెచ్చింది కమ్యూనిస్టులేనని అన్నారు. దేశ చరిత్రలో రైతు వ్యతిరేక చట్టాలను బే శరత్ గా ఉపసంహరించుకొని రైతు పోరాటాల ఎదుట ప్రధాని మోడీ మెడలు వంచిన చరిత్ర కమ్యూనిస్టులదని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో సాగునీటి కై  త్రాగునీటి కై పోరాడి  సాధించింది కమ్యూనిస్టులేనని అన్నారు. కమ్యూనిస్టులు పోరాటం వలనే గ్రామాలలో ఇండ్ల స్థలాలు దక్కాయని అట్టి స్థలాలను చిన్నాభిన్నం చేశారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుబండ శ్రీశైలం, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శికట్ట నరసింహ, గట్టుప్పల మండల కార్యదర్శికర్నాటి మల్లేశం, పార్టీ జిల్లా కమిటీ సభ్యులుచాపల మారయ్య, కర్నాటి సుధాకర్,తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘంజిల్లా సహాయ కార్యదర్శిజెర్రిపోతుల ధనంజయ గౌడ్, కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బొట్టు శివకుమార్, అచ్చిన శ్రీనివాస్, వల్గూరి శ్రీశైలం, కొత్తపల్లి నరసింహ, రాచమల్ల వెంకటరెడ్డి, కర్నాటి తుకారం, పసుపుల చెన్నయ్య, ఖమ్మం రాములు, ఖమ్మం రాములమ్మ, కర్నాటి జ్ఞానేశ్వరి, కర్నాటి ఉష  తదితరులు పాల్గొన్నారు.

Spread the love