కార్మికుల హక్కులు హరిస్తున్న బీజేపీ

– 4 లేబర్ కోడ్ ల రద్దుకై పోరాటానికి సన్నద్ధం కావాలి
– సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్
– వచ్చే నెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపు
నవతెలంగాణ సిరిసిల్ల టౌన్
కార్మికులు అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి, నాలుగు లేబర్‌కోడ్‌లను తీసుకొచ్చి కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ ఆరోపించారు. బుధవారం సిరిసిల్ల పట్టణంలోని శివాలయం దేవస్థాన హాల్లో సిఐటియు హనుమంత రంగాలు, యూనియన్ల ముఖ్య నాయకులతో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చినటువంటి బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు , కార్పొరేట్లకు కొమ్ముకాసే విధంగా కార్మికులను కట్టు బానిసలు చేసే విధంగా కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చి కార్మిక చట్టాలు, హక్కులను కాలరాస్తున్నదన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ ల రద్దుకై దేశంలోని అన్ని జాతీయ , ప్రాంతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వచ్చేనెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపట్టడం జరుగుతుందన్నారు. కార్మిక చట్టాలు , హక్కులను రక్షించుకోవడం కోసం సమ్మెలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని రంగాల , యూనియన్ల కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కోటంరాజు జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి , కార్యదర్శి కోడం రమణ , ఉపాధ్యక్షులు మూషం రమేష్ , గుర్రం అశోక్ , అన్నల్దాస్ గణేష్ , గురజాల శ్రీధర్ , సూరం పద్మ , మిట్టపల్లి రాజమల్లు , గీస బిక్షపతి , మల్యాల నర్సయ్య , సిరిమల్ల సత్యం , జిందం కమలాకర్ , రమేష్ చంద్ర , భారతి , లక్ష్మి , శ్రీనివాస్ , రవి , సురేష్ , శేఖర్ , రాజు , రమేష్ , శ్రీధర్ , నర్సయ్య , రాజెలయ్య , కుమార్ , దేవరాజు , బాబా కిషన్ , రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love