గ్రామాలలో బిజెపి బలపడాలి

– మాజీ పార్లమెంటు సభ్యుడు పోతుగంటి రాములు 
నవతెలంగాణ-ఉప్పునుంతల : ఉప్పునుంతల మండలంలో బిజెపి మండల అధ్యక్షులు తోల్లా మహేష్ యాదవ్ అధ్యక్షతన, పార్టీ క్రియశిలా సభ్యుల కార్యక్రమంలో ముఖ్య అతిథి గా మాజీ పార్లమెంట్ సభ్యులు, శ్రీ పోతుగంటి రాములు, జిల్లా అధ్యక్షులు, శ్రీ వేముల నరేందర్ రావు, రాష్ట్ర పార్టీ, రాష్ట్ర అధికార ప్రతినిధి, శ్రీ కట్ట సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ రాములు మాట్లాడుతూ.. భవిష్యత్ లో పార్టీ బలపడాలి. ప్రతి బూతులో పార్టీ కమిటీ ఏర్పాటు చేసుకోవాలి అని అన్నారు. రాబోయే రోజుల్లో ఎలక్షన్ లో ప్రతి గ్రామంలో సర్పంచ్ లు, ఎంపీటీసీ లు జడ్పీటీసీ లు గెలవాల్సి అవసరం ఉంది అని అన్నారు. కార్యకర్తలు దైర్యం గా పని చేస్తే నేను మీకు ఎల్లవేళలా మీకు పార్టీ తోడుగా ఉంటది, నేను మీకు అండగా ఉండి నరేంద్ర మోడీకి మనం బలానికి చేకూరాలని అన్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న కార్యకర్తలు, జిల్లా కార్యదర్శులు, ఇస్లావత్ శ్రీను నాయక్, కుందేళ్ల సైదులు యాదవ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు రమేష్, సురేంద్ర రెడ్డి, శ్రీహరి, శివ, మైనారిటీ నాయకుడు ఖలీల్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love