– రైతు సహకార సంఘం రైతులు వినతి..
నవతెలంగాణ – సారంగాపూర్
సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలు, పండ్ల పెంపకం తెలుసుకోవడానికి మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల రైతు ఉత్పత్తి సంఘాలను సందర్శించడానికి వెళ్తున్న సారంగాపూర్ మండలంలోని బీరవెల్లి, మ్యాక్స్ సంఘ సభ్యులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జడ్పీటీసీ ఫోరం జిల్లా మాజీ అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదారాబాద్ వెళ్లి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతిపత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ ఛైర్మన్ రఘునందన్ రెడ్డి, ఎఫ్ఎస్ సిఎస్ చైర్మన్ రాజేందర్, పిఎసిఎస్ ఛైర్మెన్ మాణిక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.