
విద్యార్థులకు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని కేంద్రాల్లో మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక మారం కేతన్ రెడ్డి జూనియర్ కళాశాలలో గల కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ ప్రశాంత వాతావరణంలో జరగాలని,విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగా హాజరుకానున్నారు. పరిసర ప్రాంతాలలో జిరాక్స్ కేంద్రాలను మూయించాలని అలాగే కేంద్రాలలో సెల్ ఫోన్లు అనుమతి లేదని స్పష్టం చేశారు.