
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ఎమ్మెల్సీ ఎన్నికలలో మైక్రో అబ్జర్వ్ పాత్ర కీలకమైనదని, ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తూ సజావుగా జరిగెలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు. ఆదివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వర్ల కు జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ హేగ్డే, ఆదనపు కలెక్టర్లు సిహెచ్ ప్రియాంక, బిఎస్ లత తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో మైక్రో అబ్జర్వ్ పాత్ర కీలకమైనదని వీరు జనరల్ అబ్జర్వర్ పర్యవేక్షణలో ఉంటూ పోలింగ్ ప్రక్రియను సూక్ష్మంగా పరిశీలిస్తూ పోలింగ్ ప్రక్రియ నిర్వహించాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాలలో మైక్రో అబ్జర్వర్లు, ప్రొసీడింగ్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలక్షన్ సజావుగా నిర్వహించాలన్నారు. 11 అంశాలతో కూడిన చెక్ లిస్టును పోలింగ్ రోజున నింపి, పోలింగ్ ముగిసిన తరువాత జనరల్ అబ్జర్వర్కి అందజేయాలని తెలిపారు.
అలాగే మరొక ముఖ్య కార్యక్రమం పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ నిర్వహించే ముందుగా జంబో బ్యాలెట్ బాక్సులను ఖాళీగా ఉందని ఏజెంట్లకు చూపించాలని, అలాగే పోలింగ్ ముగిసిన తర్వాత సీల్ చేయడం దానిపై ఏజెంట్లతో సంతకాలు తీసుకోవడం కూడా కీలకమైన అంశమని కలెక్టర్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో ప్రతి పోలింగ్ స్టేషన్కు ఒక మైక్రోబ్ జార్వర్, ప్రతి స్టేషన్ లో వెబ్ కాస్టింగ్ నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నంత వరకు సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఒక పోలీసు అధికారులు నియమించడం జరిగిందని, ఎలాంటి సమస్య తలెత్తిన వారికి తెలియజేయాలని ఎస్పీ తెలిపారు. పోలింగ్ సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల వద్దనే ఉండాలని ఎస్పీ సూచించారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్ట పర్యవేక్షణకు జిల్లాలో 27వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు 144 సెక్షన్ విధించినట్లు ఎస్పీ తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు మాస్టర్ ట్రైన్ రమేష్ మై గ్రూప్ జార్వర్లు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.