ఎన్నికల హామీలను మర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం

– దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
నవతెలంగాణ- రాయపోల్ 
ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఎన్నికలలో ఇచ్చి వాటిని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఎన్నికల హామీలను అమలు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం రాయపోల్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. శ్రీ రేణుక ఎల్లమ్మ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాయపోల్ గ్రామ గౌడ సంఘం సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  రైతుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్రా ప్రభుత్వం పూర్తిగా వైపల్యం చెందిందన్నారు. దుబ్బాక నియోజక వర్గంలోని ఆయా గ్రామాల్లో ఉన్న ఆగ్రోస్ కేంద్రాలలో ఎరువులు అందుబాటులో లేకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. రైతులకు అవసరమైన యూరియను అందుబాటులో నిల్వ చేయకపోవడంతో రైతుల పరిస్థితి ఇబ్బందిగా ఉందని, ఆటు వర్షాలు లేకపోవడంతో పాటు ఇటు సమయకి ఎరువులు లేకపోవడంతో రైతులు పడరానిపాట్లు పడుతున్నారు. అధికారులు శ్రద్ధవహించకపోవడం పట్ల ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ అమలు చేసిన పంటల పెట్టుబడుల కోసం ప్రవేశపెట్టిన రైతు బంధును ఇప్పటి వరకు రైతులకు అందించకపోవడంతో వారు పెట్టుబడుల కోసం ప్రైవేట్ వడ్డీవ్యాపారులను ఆశ్రయించాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్ట్ ల ద్వారా నీటిని విడుదల చేయకపోవడంతో పంటలు పూర్తిగా ఎండిపోవడంతో రైతులకు మరింత భారంగా మారిందన్నారు. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో కాల్వాల ద్వారా నీరు వస్తే రైతులు పంటలను కాపాడుకునే అవకాశం ఉందన్నారు. రైతుల సమస్యలను గాలికి వదిలేసిన సర్కార్ పార్టీ పిరాయింపులకు పెద్దపీట వేస్తుందని ఆయన విమర్శించారు. ఇప్పటికైన రైతుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టలని లేని పక్షంలో రైతుల పక్షాన నిలబడి ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి, కోఆప్షన్ సభ్యులు పర్వేజ్, మండల ఉపాధ్యక్షులు వెంకట్ గౌడ్, సత్యం, మండల ప్రధాన కార్యదర్శి ఇప్ప దయాకర్, మాజీ సర్పంచ్ వెంకట నరసింహారెడ్డి, మాజీ ఎంపీటీసీలు రాజు గౌడ్, మల్లా గౌడ్, నాయకులు భాగిరెడ్డి, బాల నర్స్, దయాకర్ రెడ్డి, రంగారెడ్డి, స్వామి, పరశురాములు, నవీన్ గౌడ్, మధు, మురళి గౌడ్, రాజు గౌడ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love