మొక్కజొన్న రైతుకు దిక్కెవరు .?

Who is the corn farmer?– నకిలీ విత్తనాలతో రైతు కుటుంబం ఆందోళన..
– సంబంధిత అధికారులు ఆదుకోవాలని వేడుకోలు..
– పురుగుల మందు శరణ్యం అంటున్న రైతు చల్ల సీతారాములు..
నవతెలంగాణ – తాడ్వాయి
రైతులు ఆరుకాలం కష్టం చేసి పండించిన మొక్కజొన్న పంట సరిగా పండక, నకిలీ విత్తనాలతో దళారీలతో ఇబ్బంది పడుతున్న రైతు కుటుంబం.. ములుగు జిల్లా తాడ్వాయి మండలం నర్సాపూర్(పిఏ) గ్రామానికి చెందిన చల్ల సీతారాములు అనే రైతు సింజెంటా మొక్క జొన్న విత్తనాలు (సీడ్) వేసి దిగుబడి రాక 20 ఎకరాల పంట నష్టపోయాడు. సీడ్ ఏజెంట్ మొక్కజొన్న పంట దిగుబడి ఎక్కువ వస్తుంది. పంట ప్రారంభం నుండి, పంట కోత వరకు పెట్టుబడి పెట్టి, క్వింటాకు 36 వందలకు కొనుగోలు చేస్తానని చేప్పడంతో, రైతు నమ్మి విత్తనం వేశాడు. ఒకవే దిగుబడి రాక పంటనష్టం జరిగితే ఎకరాకు 70 వేలు ఇస్తాననడంతో నమ్మి వేశాడు. 4 నెలలకు కోతకు వచ్చినా 5 వ నెల గడుస్తున్న రాకపోగా ఏజెంటు పట్టించుకోకవడంతో కోతకు వచ్చిన కంకిని రైతు విప్పి చూడగా అందులో గింజ లేదు. నకిలీ విత్తనాలని తెలుసుకుని సంబందిత అధికారులకు పిర్యాదులు చేసిన న్యాయం జరగడం లేదని సీతారాములు కుటుంబ సభ్యులు ఆవేధన చెందుతున్నారు. నకిలీ విత్తనాలు పంపిణీ చేసిన కంపెనీ పై చట్టపరమైన చర్యలు తీసుకుని జరిగిన నష్టానికి పరిహారం అందించేలా సంబందిత అధికారులు స్పందించి ఆదుకోవాలని చల్ల సీతారాములు కుటుంబం వేడుకుంటుంది. సింజెంటా మొక్కజొన్న నకిలీ షీడ్స్ తాడ్వాయి మండల వ్యాప్తంగా సుమారు 800 ఎకరాల నుండి, వెయ్యి ఎకరాల వరకు ఇచ్చారని సమాచారం. అంతేకాకుండా ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట మండలల్లో కూడా వేయిల ఎకరాల్లో నకిలీ విత్తనాల భారిన పడిన రైతులు ఉన్నట్లుగా సమాచారం. సంబందిత వ్యవసాయ శాఖ అధికారులు నకీలు విత్తనాల ఏజెంట్ ల పై చర్యలు తీసుకోని నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని ఏజెన్సీ ప్రాంత రైతులు వేడుకొంటున్నారు.

Spread the love