కాంగ్రెస్ తోనే దేశం సుభిక్షం

నవతెలంగాణ-ముత్తారం : కాంగ్రెస్ తోనే దేశం సుభిక్షంగా ఉంటుందని హరిపురం మాజీ సర్పంచ్ వేల్పూరి సంపత్ రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నారు శుక్రవారం గ్రామంలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం ఇంటింటికి తిరుగుతూ హస్తం గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో ఉచిత బస్సు, 500 గ్యాస్ సిలిండర్ ,ఆరోగ్యశ్రీ కి 10 లక్షలు,200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ని అమలు చేసిందన్నారు.ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ ఎస్ యు ఐ జిల్లా జనరల్ సెక్రెటరీ చేనవేన సాయికుమార్, గ్రామ శాఖ అధ్యక్షుడు  శ్రీనివాస్ , కార్యదర్శి కూస సంపత్, యూత్ అధ్యక్షుడు అనుమ సంపత్, సినియర్ నాయకులు  ప్రకాష్ రెడ్డి , రామంచ సమ్మయ్య,  కుమార్  , సంతోష్ , ఓదెలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love