Monday, August 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీపీఎస్ ను రద్దుచేసి, ఓపిఎస్ ను అమలు చేయాలి 

సీపీఎస్ ను రద్దుచేసి, ఓపిఎస్ ను అమలు చేయాలి 

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్ 
సీపీఎస్ ను రద్దుచేసి, ఓపిఎస్ ను అమలు, ఉద్యోగ జేఏసీ ఆదేశాలను నెరవేర్చాలనీ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి గుర్రాల బాలకృష్ణ సోమవారం విలేకరులకు ఒక ప్రకటనలో తెలిపారు.
సిపిఎస్ అనే మహమ్మారి వలన ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం భవిష్యత్తు అంధకారమయం కానున్నదని, ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ ను రద్దుచేసి, ఓపిఎస్ ను అమలు చేస్తామని తెలిపిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. రెండున్నర సంవత్సరాలు పైబడిన నేటికీ ఆ సమస్య పరిష్కారం కాలేదని, ఉద్యోగులు మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓ పిఎస్ అమలు చేయుటకు, సెప్టెంబర్ 1 విద్రోహ దిన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల న్యాయమైన, తమ హక్కుల సాధన కోసం, రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపులను ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -