గూగుల్ సర్వే ద్వారా పంట నమోదు చేయాలి ..

Crops should be registered through Google Survey..– జొన్నల కొనుగోళ్లు కేంద్రాన్ని ప్రారంభించిన ఏమ్మల్యే
నవతెలంగాణ – కుబీర్
రానున్న వేసవి కాలంలో వ్యవసాయ అధికారులు ప్రతి గ్రామంలో గూగుల్ సర్వే ద్వారా రైతులు పండించే పంటలను నమోదు చేసేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన కుబీర్ మార్కెట్ కార్యాలయంలో మార్కుఫెడ్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోళ్లు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ముందుగా యంత్రాలకు పూజలు చేసి రైతుకు శాలవా తో సన్మాంచారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముధోల్ నియోజకవర్గ రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ప్రభుత్వ కొనుగోళ్లు కేంద్రాలను ప్రారంభించాడం జరుగుతుందని అన్నారు. దింతో నియోజకవర్గంలో మొత్తం 20వేల ఎకరాల్లో జొన్న పంట సాగు చేయగా అందులో కుబీర్ లో పెద్ద మొత్తం రైతులు 10వేల ఎకరాల్లో జొన్న పంటను సాగుచేశారు. దళారీ వ్యవస్థ ను నిర్ములించేందుకు ప్రభుత్వ కొనుగోళ్లు ద్వారా 3371మద్దతు ధర కల్పించి కొనుగోళ్లు చెప్పటడం జరుగుతుంది. దింతో రైతులు పండించిన పంటలను ప్రభుత్వ కొనుగోళ్లు కేంద్రాన్నికి తీసుకువచ్చి ఆర్థికంగా ముందుడాలని కోరారు. ఎకరానికి 14క్వాంటల్ జొన్నలను తీసుకువచ్చి అధికారులకు సహకరించగలరు. అదే విదంగా నిర్మల్ జిల్లా లోనే అతి పెద్ద మండలమైన కుబీర్ లో ఒకే కేంద్రం ఉండడం తో రైతులకు దూరబరం అవుతుందనే విషయం వ్యవసాయ సహకార సంఘం, రాష్ట్ర మార్కుఫెడ్ డైరెక్టర్ రేకుల గంగా చరణ్ ఎమ్మెల్యే కు తెలపడంతో ఆయన స్పందించి మండలంలో మరో కేంద్రం చాత గ్రామంలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. అదే విదంగా మహారాష్ట్ర సరిహద్దులో చెక్క్ పోస్ట్ ఏర్పాటు చేస్తే మహారాష్ట్ర నుంచి సరఫరా కాకుండా ఉంటుందని అన్నారు. హమాలీలకు కూలి ఛార్జలు పెంచేలా చూడాలని ఎమ్మెల్యే కు తెలపడంటో ఆయన అన్ని కేంద్రంలో ఎలాంటి చర్జా లు ఉంటాయో ఎక్కడ కూడా తగ్గకుండా చూస్తామని అన్నారు.దశల వారీగా మండలాన్ని అన్ని రంగలో అభివృది చేసేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో  బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్ పి ఏ సి ఎస్ చైర్మన్ గంగా చరణ్ మాజీ ఎంపీపీ లు బోయిడి విఠల్, నగేష్, సౌంలీ రమేష్, బీజేపీ మండల అధ్యక్షులు ఏశాల దత్తాత్రి సాయినాథ్ రమేష్ మార్కెట్ కమిటీ కార్యదర్శి గంగన్న, క్రాంతి కుమార్ మండల నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు ఉన్నారు.
Spread the love