– అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అధ్యక్షురాలు నిర్మల
నవతెలంగాణ – అచ్చంపేట
ఊరుకొండ పేట ఆంజనేయ స్వామి దేవాలయ దైవదర్శనానికి వచ్చిన వివాహిత మహిళపై దేవాలయ పరిసర ప్రాంతంలో సామూహిక లైంగికదాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం( ఐద్వా) నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షురాలు ఏ నిర్మల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం అచ్చంపేటలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు నిర్మల మాట్లాడుతూ.. మహిళలపై సామూహిక లైంగికదాడులు అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. భేటీ బచావో బేటి పడావో అనే నినాదం పాలకవర్గాలు కంటిచూర్పు చర్యలుగా తీసుకుంటున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై ఇలాంటి లైంగికడాడి జరిగినప్పుడు ప్రభుత్వాలు స్పందించి కఠినమైన చర్యలు తీసుకోకపోవడంతో దేశంలో, రాష్ట్రంలో పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించాలని, ఇలాంటి లైంగిదాడులు పునారావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురా డ్లు బాలమ్మ వెంకటమ్మ, నారమ్మ, కృష్ణమ్మ, బుజ్జమ్మ, లక్ష్మమ్మ, అలివేల అంజమ్మ ఉషమ్మ, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.