రిపోర్టర్ మృతి.. దుఃఖంలోనూ పరీక్ష రాసిన కూతురు

నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు మండలం ఓ పత్రిక రిపోర్టర్ బీబీపేట సత్యం (44) మంగళవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. గత కొంతకాలంగా మీడియాలో పనిచేస్తూ అందరితో కలిసి మెలిసి తిరిగే సత్యం మరణ వార్తతో మండలంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు విషయం తెలుసుకుని సంతాపం తెలియజేశారు. సత్యం స్వగ్రామం మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం నస్కల్ గ్రామంలో అంతక్రియలు నిర్వహించగా భిక్కనూరు మండలం నుండి సన్నిహితులు అంతక్రియలకు హాజరై కుటుంబీకులను ఓదార్చారు. తండ్రి మరణం దుఃఖంలోనూ పరీక్ష రాసిన కూతురు…. ఒకవైపు 10వ తరగతి పరీక్షలు మరోవైపు తండ్రి మరణంతో పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని పదవ తరగతి పరీక్షలకు సత్యం కూతురు కీర్తన పరీక్షలు వ్రాసి తండ్రి అంతక్రియలకు రావడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఓదార్చారు. తండ్రి మరణించిన పరీక్ష రాయడం పట్ల పలువురు అభినందించారు. నిరుపేద కుటుంబానికి చెందిన రిపోర్టర్ సత్యం కుటుంబాన్ని ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు ఆదుకోవాలని కుటుంబీకులు, పలువురు కోరారు.

Spread the love