
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాలుగవ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక వ్యక్తి అదృశ్యమై మృతి చెందాడని నాలుగవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్ బుధవారం తెలిపారు. ఎస్ఎస్ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం..కోటగల్లికి చెందినటువంటి గుమ్మడి శ్రీనివాస్ రెడ్డి (48) ,వృత్తి కార్ డ్రైవింగ్ ఇతను ఫిబ్రవరి 15వ తేదీన కారు డ్రైవింగ్ పై నిజామాబాద్ నుండి కుంభమేళకు వెళ్లి తిరిగి ఈనెల 17న రాత్రి సమయంలో కుంభమేళ నుంచి నిజామాబాద్ రావడం జరిగింది. అయితే నిజామాబాద్కు తిరిగి వచ్చినప్పటి నుండి మరల వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఇతని ఆచూకీ గురించి కుటుంబ బంధువులు చుట్టుపక్కల, బంధువులలో ఇండల్లో వెతికిన గాని ఇతని సమాచారం తెలియలేదు. ఇట్టి విషయంలో తేదీ 24న రోజున దరఖాస్తు చేయగామిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. కేసు దర్యాప్తు భాగంగా విచారిస్తుండగా మంగళవారం రోజు నవీపేట గాంధీనగర్ గ్రామా శివారులో ఒక గుర్తు తెలియని శవం ఉన్నదని సమాచారం రావడంతో సంబంధిత సిబ్బంది కలిసి ఈ మేరకు అదృష మైన శ్రీనివాస్ బంధువులకు మృతదేహాన్ని చూపించగా అది శ్రీనివాస్ రెడ్డి మృతదేహంగా గుర్తించడం జరిగింది. అయితే ఇతను గత నాలుగు ఐదు రోజుల నుంచి గాంధీనగర్ గ్రామంలో బట్టలు లేకుండా పిచ్చివాడిలా తిరుగుతూ కనిపించినట్టు గ్రామస్తుల ద్వారా తెలిసింది. అయితే ఇతనికి మద్యం, కల్లు తాగడం అదేవిధంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు ఇతని ఇబ్బందుల ద్వారా తెలిసింది ఇట్టి విషయంలో అతని భార్య లక్ష్మి దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.