అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ..

Firefighters' Week posters unveiled.నవతెలంగాణ – జన్నారం
అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో సోమవారం నుంచి నిర్వహిస్తున్న వారోత్సవాల పోస్టర్లను మండల ఏఎంసీ ఛైర్మన్ లక్ష్మీనారాయణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ ఆదివారం అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ఆవిష్కరించారు. ముందుగా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్, నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన ఏఎంసీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, ను జన్నారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముజాఫర్ అలీ ఖాన్, ను నాయకులు మిక్కిలినేని రాజశేఖర్ ను శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ వారోత్సవాల్లో భాగంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు సంస్థలలో అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యలపై అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజాఫర్ అలీ ఖాన్ నాయకులు మిక్కిలినేని   రాజశేఖర్, తాళ్ల పెళ్లి  రాజేశ్వర్ ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love