నవతెలంగాణ – ఉప్పునుంతల
పేదలు కూడా సంపన్నులతో సమానంగా సన్నబియ్యం తినే విధంగా సన్న బియ్యం అందించాలని గొప్ప ఆలోచన చేసి, గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉగాది పర్వదినాన సందర్భంగా ఈ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గురువారం ఉప్పునుంతల మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రయోగాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమాన్ని రెండు చౌక ధర దుకాణాలలో రాష్ట్ర వ్యవసాయ ప్రణాళిక సంఘం సభ్యులు కొండారెడ్డిపల్లి కెవిఎన్ రెడ్డి, స్థానిక తాహసిల్దార్ ప్రమీల ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియం కార్యక్రమము అమలు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, పౌరసరపాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, నల్లమల్ల ముద్దుబిడ్డ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కు ఈ సందర్భంగా మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కట్టా అనంతరెడ్డి ,కల్వకుర్తి మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు వంగూరు మండల పార్టీ అధ్యక్షులు పండిత్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిప్పర్తి నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.