దేశ చరిత్రలోనే తెలంగాణ ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని పిసిసి ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ తెలిపారు. గురువారం స్థానిక ఇందిరానగర్ లో పావురాల సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం సందర్భంగా ప్రమోద్ కుమార్ మున్సిపల్ మాజీ చైర్మన్లు బర్రె జహంగీర్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, 23వ వార్డు మాజీ కౌన్సిలర్ పడగేల రేణుక ప్రతి లతో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచర మంత్రివర్గ సభ్యులందరూ నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బుషపాక బిక్షపతి, నర్సింగరావు మల్లేష్, అనిల్, బర్రె ప్రభాకర్ గంగారం రమేష్, స్వామి, తోట మహేందర్, నువ్వుల రాజు, పార్వతమ్మ, సునీత, లావణ్య, లక్ష్మి మంజుల, పద్మ, సుజాత, కృష్ణవేణి, హేమలత, ఎల్లమ్మ ఝాన్సీ మమత లావణ్య పాల్గొన్నారు.