
నవతెలంగాణ – పెద్దవంగర
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకు పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మకమని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, పార్టీ సీనియర్ నాయకులు తోటకూరి శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండలంలోని వడ్డెకొత్తపల్లి, పోచారం, రామచంద్రు తండా, గంట్లకుంట గ్రామాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆర్ఐ భూక్యా లష్కర్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల కోసం మహత్తరమైన పథాకానికి శ్రీకారం చుట్టారని అన్నారు. రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా సన్నబియ్యాన్ని సరఫరా చేస్తామని, ఈ పథకం పేదల గుండెల్లో నిలుస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో అర్హులైన పేద ప్రజలందరికి రేషన్ కార్డులను కూడా అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు సీతారాం నాయక్, ముత్తినేని శ్రీనివాస్, బండారి వెంకన్న, జాటోత్ వెంకన్న, మోహన్ రావు, కిసాన్ సెల్ అధ్యక్షుడు కాలేరు కరుణాకర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు మద్దెల యాకన్న, వేముల వెంకన్న, మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎరుకల సమ్మయ్య గౌడ్,మండల sc సెల్ అధ్యక్షులు చెరుకు సత్యం, గ్రామ పార్టీ అధ్యక్షుడు ముత్తినేని సోమన్న, గౌరవ అధ్యక్షులు ఎండీ ముక్తార్ పాషా, ఉపాధ్యక్షుడు కన్నె సతీష్, ప్రధాన కార్యదర్శి బండి లచ్చయ్య, మాజీ ఎంపీటీసీ ఈరెంళటి అనురాధ శ్రీనివాస్, గ్రామ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొండ్రాతి శ్రీనాథ్, తాటిపాముల సంపత్, నాగరాజు,మహేష్, సోమ్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.