కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర ని మంగళవారం బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చింతల శంకర్ నేత మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి, పూల గుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతోపాటు బీసీ సంక్షేమ సంఘం జిల్లా యూత్ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ గౌడ్, టౌన్ ఉపాధ్యక్షులు సంఘ గౌడ్, కార్యదర్శి కూచి పెంటయ్య, రామారెడ్డి ఇంచార్జ్ దినేష్, తదితరులు పాల్గొన్నారు.