ఆశా లకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాలి: సీఐటీయూ

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం వేతనాలు పెంచాలని ఉద్యోగ భద్రత కల్పించే హామీలను అమలు చేయాలని,కనీస వేతనం రూ రూ.18 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహసిల్దార్ క్రిష్ణ ప్రసాద్ కు అందజేశారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ ఆశా వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అనేక ఆందోళన లు ఫలితంగా కమిషనర్ స్పందిస్తూ రూ.50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కల్పిస్తామని,మట్టి ఖర్చులకు రూ.50 వేలు ఇస్తామని,రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తామని, సెలవులు ఇస్తామని,టార్గెట్ రద్దు చేస్తామని  నిర్దిష్టమైన హామీలు ఇచ్చి నేటికీ నెరవేర్చలేదని అన్నారు. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశా వర్కర్ సమస్యలపై చర్చించి వారి సమస్యలు పరిష్కరించాలని ఏఎన్ఎం శిక్షణ పూర్తిచేసిన ఆశా లకు ఏఎన్ఎం పోస్టులలో ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని వైటేజీ మార్కులు వెంటనే నిర్ణయించాలని, ఆశలకు డ్యూటీలు వేసే సందర్భంగా వెహికల్ తో పాటు సిబ్బందిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో భారతి,నాగమణి,తిరుపతమ్మ, విష్ణు కుమారి,మంగ,చిలకమ్మా,సునీత తదితరులు పాల్గొన్నారు.
Spread the love