
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన నాయకులకు వేసిన విగ్రహాల ముసుగు తీయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని బిఆర్ఎస్ యూత్ అడ్వాలపల్లి గ్రామ అధ్యక్షుడు రాజు ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపించారు.ఈ సందర్భంగా మాట్లాడారు మండలం కొయ్యూర్ గ్రామంలోని ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన మాజీ ఎంపిపి స్వర్గియ బెల్లంకోండ మల్హార్ రావు విగ్రహానికి ఎమ్మెల్సీ టీచర్,గ్రాడ్యుయెట్స్ ఎన్నికల కోడ్ సందర్భంగా విగ్రహనికి ముసుగు వేయగా, ఈ నెల 8వ తేదీతో ఎన్నికల కోడ్ ముగిసిన కూడా ఇంకా మల్హార్ రావు విగ్రహానికి ముసుగు తీయకపోవడంతో అధికారుల నిర్లక్షం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.ఇప్పటికైనా విగ్రహానికి ముసుగు వెంటనే తీయాలని కోరారు.